ఎస్​బీఐ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చల్లా శ్రీనివాసులు ..  ఎఫ్​ఎస్​ఐబీ సిఫార్సు 

ఎస్​బీఐ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చల్లా శ్రీనివాసులు ..  ఎఫ్​ఎస్​ఐబీ సిఫార్సు 

న్యూఢిల్లీ: ఎస్​బీఐ చైర్మన్ పదవికి ఎస్​బీఐ  సీనియర్ మోస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్​ఎస్​ఐబీ) శనివారం సిఫార్సు చేసింది.  శెట్టి ప్రస్తుతం ఎస్​బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్,  టెక్నాలజీ వర్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూస్తున్నారు.  ఎస్​బీఐ చైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి 63 ఏళ్లు. ప్రస్తుత చైర్మన్​ దినేష్ కుమార్ ఖరా ఆగస్టు 28న పదవీ విరమణ చేస్తారు. ఆయన  స్థానంలో శెట్టి బాధ్యతలు స్వీకరిస్తారు.  ఎఫ్​ఎస్​ఐబీ, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు,  ఆర్థిక సంస్థల డైరెక్టర్లను నియమిస్తుంది. ఇది జూన్ 29న చైర్మన్​ స్థానం కోసం 3 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.

పనితీరు,  మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్​బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేశామని ఎఫ్​ఎస్​ఐబీ ఒక ప్రకటనలో తెలిపింది. సంప్రదాయం ప్రకారం, ఎస్​బీఐలో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ల బృందం నుంచి చైర్మన్ నియమిస్తారు. దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి ఎఫ్​ఎస్​ఐబీ పేరును సిఫారసు చేస్తుంది. ఏసీసీకి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు.  ఎఫ్​ఎస్​ఐబీకి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్  మాజీ సెక్రటరీ భాను ప్రతాప్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు.