ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి

ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్ లో శుక్రవారం జరిగిన మరో భారీ ఎన్​కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణ్ పూర్, దంతెవాడ, కొండెగావ్​జిల్లాల బార్డర్​లోని బస్తర్ డివిజన్​లో.. ముంగేడీ – -గోబేల్​ గ్రామాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో 45వ బెటాలియన్​ ఐటీబీపీకి చెందిన 1,200 మంది జవాన్లు గురువారం కూంబింగ్ ఆపరేషన్​కు వెళ్లారు. 

బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. శుక్రవారం తిరిగి వస్తున్న క్రమంలో గోబేల్​అడవుల్లో మావోయిస్టులు అటకాయించారు. బలగాలపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో బలగాలు మావోయిస్టులను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.