ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుని ఏడుగురు మృతి

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుని ఏడుగురు మృతి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ డెవెలప్ చేస్తున్న ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుని యూకేలో ఏడుగురు చనిపోయారు. వ్యాక్సిన్ వేసుకున్న 30 మందికి రక్తం గడ్డకట్టింది. వారిలో ఏడుగురు చనిపోయారని బ్రిటన్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రకటించింది. దాంతో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని యూరోపియన్ కంట్రీలు ఈ వ్యాక్సిన్‌పై నిషేధం విధించాయి. బ్లడ్ క్లాట్ ఇష్యూతో పిల్లలపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్  ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. వ్యాక్సిన్‌కు రక్తం గడ్డకట్టడానికి సంబంధం ఉందని మెడికల్ రెగ్యులేటరీ చెప్పడంతో.. పిల్లలపై ట్రయల్స్ నిలిపేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్  యూనివర్సిటీ ప్రకటించింది.