ముగిసిన తుది విడత పోలింగ్

ముగిసిన తుది విడత పోలింగ్

లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ముగిసింది. చివరి విడతలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. ఈ దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్‌ జరిగింది. మొత్తం 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో 10.01 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 53 శాతం పోలింగ్ జరిగింది. బీహార్ లో 47 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో 57 శాతం, మధ్యప్రదేశ్ లో 60 శాతం, పంజాబ్ లో 51 శాతం, ఉత్తర్ ప్రదేశ్ లో 47 శాతం, వెస్ట్ బెంగాల్ లో 65 శాతం, జార్కండ్ లో 67 శాతం , చండీగడ్ లో 51 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.