జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇప్పించండి : జర్నలిస్టులు

జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇప్పించండి : జర్నలిస్టులు

నారాయణ్ ఖేడ్, వెలుగు: జర్నలిస్టుల ఇంటి బిల్లులు ఇప్పించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డికి పలువురు జర్నలిస్టులు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. ఖేడ్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా గత ప్రభుత్వం 43 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించిందన్నారు. అప్పటి తహసీల్దార్ జర్నలిస్ట్ లకు ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో వారికి కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. 

కొందరి ఇంటి నిర్మాణం పూర్తి కాగా మరి కొందరి ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది. పెండింగ్​లో ఉన్న ఇండ్ల నిర్మాణాల బిల్లులను ఇప్పించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకులంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలో బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు అమృత్, మధుసూదన్ రెడ్డి, పుండరీకం, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, చోటు, ఖైసర్ పాల్గొన్నారు.