ఇక వీరు మారరా.. పూంచ్ సెక్టార్ లో పాక్ డ్రోన్లు

ఇక వీరు మారరా..  పూంచ్ సెక్టార్ లో పాక్ డ్రోన్లు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని పూంచ్ సెక్టార్​లో నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ)కు సమీపంలో పాకిస్తాన్ కు చెందిన ఆరు డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఆదివారం రాత్రి 9:15 గంటల ప్రాంతంలో మెంధార్ సెక్టార్, బాలకోట్, లాంగోట్, గుర్సాయ్ నల్లా ప్రాంతాల మీదుగా డ్రోన్ కదలికలను గుర్తించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. 

డ్రోన్లు చాలా ఎత్తులో ఎగరడంతో వాటిని అడ్డగించడం కష్టమైంది.. అయితే, కొన్ని నిమిషాల తర్వాత ఆ  డ్రోన్లు తిరిగి పాకిస్తాన్ భూభాగానికి వెళ్లాయని అధికారులు చెప్పారు. వాటిని నిఘా కోసం పంపించి ఉంటారని.. ఈ ప్రాంతంలో ఆర్మీ కదలికలపై నిఘా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, బార్డర్​లో డ్రోన్లు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఎలాంటి వెపన్స్​ కానీ డ్రగ్స్​  కానీ జారవిడువలేదని చెప్పారు.