రాజ్భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

రాజ్భవన్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

ఎన్ఈపీ 2020ని రద్దు చేయాలని డిమాండ్ 
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. దీనిపై రాష్ట్రాలతో చర్చించకుండా కేంద్రం ఏకపక్షంగా పార్లమెంట్​లో బిల్లు ఆమోదించిందని ఆరోపించింది. మంగళవారం ఎస్ఎఫ్ఐ రాష్ర్ట కమిటీ హైదరాబాద్ లోని రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది. దాంతో ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ మూర్తి, ప్రధాన కార్యదర్శి నాగరాజుతోపాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పీఎస్ లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ.. యూనివర్శిటీల ప్రైవేటీకరణ ప్రమాదకరమని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ర్టం విడిపోయి 9 ఏండ్లు అవుతున్నా విభజన హామీలను నెరవేర్చలేదని గుర్తుచేశారు. విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం  ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మూర్తి, నాగరాజు  పేర్కొన్నారు.