నాగర్ కర్నూల్ జిల్లాలో గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలి : తారా సింగ్

నాగర్ కర్నూల్ జిల్లాలో గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలి : తారా సింగ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గుర్తింపు లేని కాలేజీలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారా సింగ్ డిమాండ్ చేశారు.  మంగళవారం ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకటరమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ప్రైవేట్ కళాశాలలు నడుపుతున్నారన్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కాలేజీలను తక్షణమే విజిట్ చేసి  యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అభిలాష్, వినయ్, చందు, కార్తికేయ  పాల్గొన్నారు.