నిర్భయ కేసు: ఒకరి తర్వాత ఒకరికి ఉరి వేస్తాం

నిర్భయ కేసు: ఒకరి తర్వాత ఒకరికి ఉరి వేస్తాం

నిర్భయ దోషుల ఉరిని సవాల్  చేస్తూ.. కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేంద్రం తరుపున.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు. శిక్ష అమలు ఆలస్యం చేసేందుకే దోషులు.. పిటిషన్లు వేస్తున్నారని కోర్టుకు చెప్పారు. కేసులో తుది తీర్పు వచ్చాక రెండేళ్లకు దోషులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారన్నారు. మెర్సీ పిటిషన్ అనేది ఒక అప్లికేషన్ మాత్రమేనని.. అది న్యాయప్రక్రియలో ఒక భాగం కాదని కోర్టుకు వివరించారు.

దోషుల్లో ఒకరి మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉందనే కారణంతో మిగతా వాళ్లకు శిక్ష అమలు చేయకుండా ఉండటం సరికాదన్నారు మెహతా. అందరికి ఒకే సారి శిక్ష అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. క్షమాభిక్ష రిజెక్ట్ అయిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టును కోరారు.

దోషులు న్యాయవ్యవస్థతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. మెర్సీ పిటిషన్ రిజెక్ట్ అయ్యాక శిక్ష అమలు చేసేందుకు 14 రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే.. ఈ 14 రోజులు ముగిసే లోపు మరో దోషి.. మెర్సీ పిటిషన్ వేస్తున్నారని కోర్టుకు చెప్పారు. దీనివల్ల ఉరిశిక్ష అమలు ఆలస్యం అవుతోందన్నారు.

ఉరిశిక్ష అమలును ఆలస్యం చేయాలన్న ఏకైన లక్ష్యంతోనే దోషులు పిటిషన్లు వేస్తున్నారన్నారు మెహతా. వాదనల సందర్భంగా.. ఈ కేసులో గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల్లోని అంశాలను చదివి వినిపించారు.