శభాష్ మితు ట్రైలర్..మిథాలీగా అదరగొట్టిన తాప్సీ

శభాష్ మితు ట్రైలర్..మిథాలీగా అదరగొట్టిన తాప్సీ

23 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం శభాష్ మితు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాప్సీ మిథాలీరాజ్ గా నటిస్తోంది.  ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేయగా..తాజాగా మూవీ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

మెన్‌ ఇన్‌ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్‌ ఇన్‌ బ్లూ అనే ఓ టీమ్‌ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో  ట్రైలర్ మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది..ఆమె  క్రికెటర్‌ అయ్యే క్రమంలో ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం మిథాలీ శ్రమించిన తీరును ట్రైలర్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ట్రైలర్  ఆద్యంతం మనసుని హత్తుకునేలా ఉంది. ఇక మిథాలీగా తాప్సీ వంద శాతం సెట్ అయిందని చెప్పాలి. ఆమె నటన అద్భుతం. మిథాలీగా తాప్సి హావభావాలు మనసును హత్తుకుంటాయి. 

ఇక శభాష్ మితు చిత్రం వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై  నిర్మితమైంది. జులై 15న ఈ చిత్రం విడుదల కానుంది.