రేవ్‌పార్టీలో షారూక్ ఖాన్ కొడుకు అరెస్ట్

రేవ్‌పార్టీలో షారూక్ ఖాన్ కొడుకు అరెస్ట్

ముంబై సముద్ర తీరంలో క్రూజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో దాడులు చేసింది. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో షారూఖ్ ఖాన్ కొడుకు అర్యాన్ ఖాన్, ముగ్గురు మహిళలు సహా మొత్తం 13 మందిని కస్టడీలోకి తీసుకున్నారు NCB అధికారులు. ముగ్గురు మహిళలు ఢిల్లీకి చెందిన వారని చెప్పారు. కస్టడీలోకి తీసుకున్న వారందరిని ప్రశ్నిస్తున్నారు. రైడ్స్ లో నిషేధిత కొకైన్, హషీష్, ఎండీ లాంటి డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు రేవ్ పార్టీ ఆర్గనైజర్లకూ సమన్లు పంపింది NCB. ఫ్యాషన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ పాత్రపైనా NCB ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ఫ్యాషన్ టీవీ ఎండీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసినట్లు సమాచారం. కార్డెలియా క్రూజ్ లో పార్టీకి ఒక్కొ టికెట్ ధర 60 వేల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఫారీన్ ఆర్టిస్టులతో పాటు హై ప్రొఫైల్ డీజేలు క్రూజ్ లో ఉన్నట్లు సమాచారం. క్రూజ్ లో ఉన్న చాలా మంది ఢిల్లీకి చెందిన వారుగా గుర్తించారు. ప్యాసెంజర్స్ లగేజ్ లో కూడా డ్రగ్స్ గుర్తించినట్లు తెలుస్తోంది.