నయన్ పెళ్లికి షారూఖ్ ఖాన్

నయన్ పెళ్లికి షారూఖ్ ఖాన్

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని షెరిటన్ హోటల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వేడుకలో పలువురు సినీ తారలు సందడి చేశారు.ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్  నయన్,విఘ్నేశ్ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పెళ్లిలో క్రిమ్‌ కలర్‌ షూట్‌, వైట్‌ షర్డ్‌ ధరించి..సన్ గ్లాసెస్ లో షారుక్‌ స్టైలిష్‌ లుక్‌లో దర్శనం ఇచ్చాడు.ఈ ఫొటోను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్దాని షేర్‌ చేసింది.షారుక్‌తో పాటు డైరెక్టర్‌ అట్లీ కూడా హజరయ్యాడు.