రజనీకాంత్ 'జైలర్ 2' నుండి షారుఖ్ అవుట్... నో చెప్పడానికి అసలు కారణం ఇదే!

రజనీకాంత్ 'జైలర్ 2' నుండి షారుఖ్ అవుట్... నో చెప్పడానికి అసలు కారణం ఇదే!

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లకు బాక్సాఫీస్ వద్ద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి సినిమాలు వస్తున్నాయంటే ఆ సందడే వేరు. అలాంటిది ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని కోట్లాది మంది అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' (Jailer 2) లో షారుఖ్ ఒక పవర్ ఫుల్ కామియో రోల్ చేయబోతున్నారన్న వార్త నెట్టింట తుపానులా వ్యాపించింది. అయితే లేటెస్ట్ వీరిద్దరి కలయికకు సంబంధించిన వార్త ఒకటి బయటివచ్చింది. 

జైలర్' నో చెప్పిన బాద్‌షా!

లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ .. 'జైలర్ 2' ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్' (King). ఈ సినిమా షారుఖ్‌కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, దీని ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది. తన కూతురు లాంచ్ అవుతున్న సినిమాలో తన లుక్, నటన అత్యంత ఎక్స్‌క్లూజివ్‌గా ఉండాలని షారుఖ్ భావిస్తున్నారు. 'కింగ్' విడుదలయ్యే వరకు మరే ఇతర సినిమాల్లోనూ కనిపించకూడదని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Also Read :  బర్త్‌డే కాదు.. చావుకి దగ్గరయ్యాను

రజనీతో బాద్‌షా ఏమన్నారంటే?

కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే ఉన్నప్పటికీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయాన్ని ఆయన స్వయంగా రజనీకాంత్‌కు వివరించినట్లు సమాచారం. రజనీకాంత్ అంటే తనకు ఎంతో గౌరవమని, భవిష్యత్తులో సరైన సమయంలో ఖచ్చితంగా కలిసి నటిద్దామని షారుఖ్ హామీ ఇచ్చారట. 'జైలర్ 2' ఆగస్టులో, 'కింగ్' డిసెంబర్‌లో విడుదల కానున్న నేపథ్యంలో తన ఎక్స్‌క్లూజివిటీ దెబ్బతింటుందని షారుఖ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

'జైలర్ 2'షూటింగ్ పూర్తి..

మరోవైపు, రజనీకాంత్ 'జైలర్ 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. షారుఖ్ తప్పుకోవడంతో, ఇప్పుడు ఆ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ మరో దక్షిణాది సూపర్ స్టార్‌ను సంప్రదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌లో బాద్‌షా మేనియా!

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న 'కింగ్' సినిమాలో షారుఖ్, సుహానా ఖాన్‌లతో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 2026లో థియేటర్లలో సందడి చేయనుంది. ఏది ఏమైనా, రజనీ-షారుఖ్ కాంబో మిస్ అవ్వడం సినీ ప్రియులకు కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినా, 'కింగ్' మూవీతో షారుఖ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.