టీమిండియాపై షాహిద్ అఫ్రిదీ సంచలన ఆరోపణలు

టీమిండియాపై షాహిద్ అఫ్రిదీ సంచలన ఆరోపణలు

టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టీమిండియాకు ఐసీసీ అండగా ఉందన్నాడు. అందుకే రోహిత్ సేన విజయాలు సాధిస్తోందని ఆరోపించాడు. పాక్, బంగ్లా మ్యాచులు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. భారత్ను ఎలాగైనా సెమీస్ ఆడించాలని ఐసీసీ ప్లాన్ చేసిందని..అందుకే..ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్కు ఫేవర్గా వ్యవహరిస్తోందని అక్కసు వెళ్లగక్కాడు.  అఫ్రిది ఆరోపణలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియా ఆరోపణలు చేస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

టీమిండియాకు అనుకూలంగా అంపైర్లు 


భారత్ బంగ్లా మ్యాచ్‌లో వర్షం వల్ల ఔట్‌ ఫీల్డ్‌ చాలా చిత్తడిగా ఉందని అఫ్రిది అన్నాడు. ఈ మ్యాచ్లో ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరించిందని చెప్పాడు. వానతో ఆగిన మ్యాచ్ను అంపైర్లు తిరిగి ప్రారంభించారన్నాడు. దీనికి అనేక కారణాలున్నాయని చెప్పుకొచ్చాడు. ఐసీసీపై ఒత్తిళ్లు రావడం వల్లే ఇలా జరిగిందని విమర్శించాడు. 

బంగ్లా పోరాడినా...
భారత్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా అద్భుతంగా పోరాడిందని అఫ్రిది తెలిపాడు. ముఖ్యంగా లిటన్‌ దాస్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని మెచ్చుకున్నాడు. వికెట్లు కోల్పోకపోతే మాత్రం బంగ్లాదేశ్ తప్పక గెలిచేదన్నాడు. కానీ పరిస్థితులు బంగ్లాకు కలిసి రాలేదని తెలిపాడు. అటు భారత్ పాక్‌ మ్యాచ్‌ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించినవారికి  ఉత్తమ అంపైరింగ్‌ అవార్డులు దక్కుతాయని అఫ్రిది సెటైర్లు వేశాడు.