
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shahrukh khan), స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ(Rajkumar Hirani) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ(Dunki). ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుక్.. డంకీ మూవీతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు చిత్ర యూనిట్.
ఇందులో భాగంగానే తాజాగా.. షారుక్ తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి షిర్డీ సాయి బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షారుక్ ఖాన్‌కు సన్మానం చేశారు ఆలయ ట్రస్ట్ అధికారి శివ శంకర్. ఇక రెండు రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణోదేవి మాతను దర్శించుకున్న షారుక్.. ఇప్పుడు షిర్డీ సాయి బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:-ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. అమర్ను టార్గెట్ చేసిన శివాజీ.. మండిపడుతున్న అమర్ ఫ్యాన్స్