శక్తివంతమైన దేవతలు - వారి మహిమలు

శక్తివంతమైన దేవతలు - వారి మహిమలు

త్రిమూర్తుల అంశతో జన్మించిన దుర్గామాత దశావతారాల్లో  ఒక్కో రాక్షసుడిని అంతమొందించిందని పురాణాలు చెబుతున్నాయి.  . ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో  అవతరించింది. ఈ అవతారాల గురించి  తెలుసుకున్నా..దసరా నవరాత్రిళ్ల సమయంలో అర్చించినా భక్తులకు ఆ తల్లి సర్వశుభాలనూ చేకూరుస్తుందని వేదాల్లో ఉందని పండితులు అంటున్నారు. దేవీ భాగవతంలో ఆ జగజ్జనని దశావతారాల గురించి వివరంగా చెప్పబడింది.   భక్తులు తమ ధర్మాలను పాటిస్తూ త్రిమూర్తుల అంశతో జన్మించిన దేవతా మూర్తి దశావతారాల విశేషాలను విన్నా, చదివినా విశేషసుఖాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  పురాణాల ప్రకారం అమ్మవారి దశావతారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. . . .

1. త్రిపుర సుందరి:

 


హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. పార్వతీ దేవి, గాయత్రి మాత, మహా కాళి, మహాలక్ష్మీ, పరమేశ్వరి, మహా సరస్వతి, రాజ రాజేశ్వరి, కనక దుర్గ, లలితా దేవి ఇలా ఏ పేరుతో పిలిచినా.. ఎన్ని రూపాల్లో ఉన్నా పరాశక్తి ఒక్కటే. ఈ శక్తిని ఆరాధించేందుకు మునులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజ  మాసం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రసిద్ధి చెందాయి.  త్రిమూర్తిని (బ్రహ్మ, విష్ణు, శివుడు) సృష్టించి విశ్వ సృష్టిని ప్రారంభించింది.  శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని ఎరుపు, కేసరి రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అమ్మవారికి దద్దోజనం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు

2. తారా దేవి

తారాదేవిని త్రిమూర్తులకు జన్మనిచ్చిన ఆదిపరాశక్తిగా వర్ణిస్తారు.  తారా దేవి రూపాలలో ప్రసన్నంగా, కరుణామయిగా, దయాస్వరూపిణిగా, ఉగ్రతార స్వరూపిణిగా ఉంటుంది.  ప్రతి జీవి పడే సాధక బాధలు తారాదేవికి తెలుసు కాబట్టి దయా హృదయంతో తనను  ఆశ్రయించిన వారికి ఆ బాధలు పోగొట్టడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది.  తారామాత పుట్టుక గురించి తంత్రంలో ఓ కథ ప్రచారంలో ఉంది.

క్షీర సాగరాన్ని చిలుకుతున్నప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని లోక రక్షణకై లోకనాయకుడూన పరమేశ్వరుడు స్వీకరించాడు.  అయితే దానికి ప్రభావం నుంచి పరమేశ్వరుణ్ణి తప్పించడానికి ఆ జగన్మాత  తారాదేవి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు చనుబాలనిచ్చి ఆ విష ప్రభావాన్ని తగ్గించింది.  ఆ అమృతాన్ని తాగడం వల్లనే శివుడు ఆ భయంకర విష ప్రభావం నుంచి బయటపడ్డాడని పురాణ తంత్రాలలో ఈ గాధ ఉందని పండితులు చెబుతుంటారు. 

3. కాళికా దేవి  

పార్వతీదేవి ఉగ్ర రూపమే కాళికాదేవి.  కాళికామాత సృష్టి చైతన్యానికి రూపం.  కాల స్వరూపం.. కాలం ఎప్పుడూ గతిశీలమే.   అంటే నిరంతరం చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది.  దారుకుడు అనే రాక్షసుడిని వధించడానికి దుర్గాదేవి నుదుటి నుంచి క్రోధజ్వాలయై కాళిక జన్మించిందని .. రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడానికి భయంకర రూపంలో అవతరించిందని దేవీ పురాణం...  మార్కండేయ పురాణాలు చెబుతున్నాయి.

4.  భువనేశ్వరి దేవి

ఆ పరమేశ్వరి యొక్క నాలుగవ మహా విద్యయే భువనేశ్వరి దేవి. భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భుః అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః స్వర్గము ఈ మూడింటిని యేలే తల్లి అని అర్థం. ఈమెకే శ్రీ రాజరాజేశ్వరీ దేవి అనే పేరు కూడా ఉంది.

ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడివుంది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయనారంభించాడు. సృష్టి లో తాను కోరుకున్న ప్రతీ వస్తువునీ, ప్రతీ ప్రాణినీ బ్రహ్మ సృజించాడు. కానీ ప్రాణులలో క్రియా శక్తిని మాత్రం నింపలేకపోయాడు. అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోరతపస్సు చేసాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో, మరో చేత అంకుశంతో, వరదాభయ ముద్రలతో, అరుణవర్ణంలో, కమలాసనయై బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది. అపై బ్రహ్మచే స్తుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టి లోని అణువణువులో క్రియా శక్తిగా ప్రవేశించింది

5. పీతాంబరి దేవి

 కాళికాదేవి దశ అవతారములలో బగళాముఖీ అవతారం ఒకటి.   ఈ అవతారాన్నే  ఉత్తర భారతదేశంలో పీతాంబరి దేవి అని పిలుస్తారు.  బగళాముఖీ దేవి తన దుడ్డు కర్రతో భక్తుని దురభిప్రాయాలు, భ్రమలు (లేదా భక్తుని యొక్క శత్రువులను) నాశనం చేస్తుంది.  బగళాముఖీ దేవి బంగారు సింహసనంపై, చేతులో పసుపు కమలతో సముద్రం మద్యలో ఉంటుంది.ఆమె అర్ధచంద్రాకార తల కలిగిఉంటుంది. కొన్ని చోట్ల రెండు చేతులు, మరి కొన్ని చోట్ల నాలుగు చేతులు కలవు అని ఉన్నాయి.  బగళాముఖీ దేవి కోర్టు కేసుల నుండి, అప్పుల నుండి బయట పడవేసె దేవతని పూజారులు చెబుతుంటారు.  అందుకే దాదాపు లాయర్ల ఆఫీసుల్లో పీతాంబరి దేవి ఫొటో ఉంటుంది. 

బగాళా అనగా "బంధించు", ముఖీ అనగ "ముఖం". అందువలననే ముఖం పట్టుకోవటానికి లేదా నియంత్రణ అధికారం బగళాముఖీ దేవి ఉంది. బగళాముఖీ దేవి బంగారు ఛాయతో పసుపు రంగు దుస్తులను దరించి ఉంటుంది.బగళాముఖీ దేవిని పసుపు వస్త్రములు దరించి, పసుపు వస్త్రముపై కూర్చుని, పసుపు పువ్వులతో పూజించాలని పండితులు చెబుతున్నారు. 


6. భైరవి మాత

దశమహావిద్యలలో 6వ మహావిద్యే ఈ భైరవి మాత. ఈ భైరవినే త్రిపుర భైరవి, బాల భైరవి, కాల భైరవి అని కూడా పిలుస్తారు. నీతి, నిజాయితీ, జ్ఞానం, వరాలను ప్రసాదించే దేవత. ఈ భైరవి మాతను శుభంకరి అని కూడా పిలుస్తారు. భైరవ సమేత భైరవి మాత ప్రపంచంలో జరిగే సృష్టికి, ప్రపంచ వినాశనానికి కారణ భూతురాలు అవుతుంది. ఈ ప్రపంచం మొత్తం కూడా భైరవి మాత అదుపు ఆజ్ఞలలో ఉంటుంది. ఈ త్రిపుర భైరవి తాంత్రిక సాధన చేసిన వారు ఐహిక కోరికలను అదుపులో ఉంచుకునేందుకు, సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు భైరవి  మాత అనుగ్రహిస్తుంది.

తంత్రశాస్త్రంలో భైరవి మాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శీఘ్ర ఫలితాల కోసం, సంతానం కోసం, బాధల నుండి విముక్తి పొందటం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం దశమహావిద్యలలో ఒకరైన భైరవి మాత సాధన సాధకులు చేస్తారు. ఈ భైరవి మాత యొక్క తంత్ర సాధన వల్ల, హోమం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, దీర్ఘాయువు లాంటి ఇంకా ఎన్నో వరాలను ఆ భైరవి మాత మనకు అనుగ్రహిస్తుంది. సాధకుడు ఈ తంత్ర సాధన ద్వారా సిద్ధి పొందిన వెంటనే షీఘ్రంగా ఫలితాలు కనబడతాయి. భైరవి సాధనను నియమానుసారంగా, క్రమబద్ధంగా చేసిన సాధకుడికి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. దీనివల్ల ఆ సాధకునిలో ఆధ్యాత్మికత పెరగటమే కాకుండా మానవాతీత దుష్టశక్తులను, ప్రయోగాలను ఎదిరించే కిటుకులు, శక్తి సాధకుడు పొందుతాడు. అంతేకాకుండా భైరవి సాధన చేసిన సాధకుడికి అందరిని ఆకర్షిస్తూ  మాట్లాడే శక్తి, వాక్చాతుర్యం కలుగుతాయి.

7.   సరస్వతి దేవి

నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం ఆశ్వయుజ శుద్ధ సప్తమీ నాడు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంతో దర్శనమిస్తుంది. చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీ దేవిని వర్ణిస్తున్నాయి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష మహా సరస్వతులుగా సప్త నామాలతో పూజలందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. 

బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించి తనను పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని వివేచనా శక్తిని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీ దేవి. మూల నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. సరస్వతీ అమ్మవారు నెమలి వాహనం మీద, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాల ధరించి, అభయముద్రతో, వీణను రెండు చేతులతో ధరించి, చందన చర్చిత దేహంతో దర్శినమిస్తుంది.

8. ధూమావతి దేవి

 

ధూమావతి  దేవి  తన ప్రబావములను కేతువు రూపంలో మనకు చూపిస్తుంది . రాహువు వలన , కేతువు వలన డబ్బు పై గానీ , సుఖాలపై గానీ పేరు ప్రతిష్టిలపై గానీ ఎలాంటి మక్కువలేని నిజమైన వారు వస్తారు . రాహువు  మాయను దాటిన తర్వాతే , జాతకుడు ఈ కేతు గ్రహానికి తలవంచాల్సి ఉంటుంది . ధూమావతి తంత్ర సాధన కొంత కష్టమైనది ... ధూమావతి సాధన చేసిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది .. ఎందుకు అంటే కేతోః మోక్షకారకాః అంటాం .. జన్మకుండలిలో లగ్నంలో కేతువు ఉన్నా , కాలసర్పదోషం ఉన్నా , కేతుమహాదశ జరుగుతున్నా , విచిత్ర అంటురోగాలు అంటుకున్నా , చేతబడి లాంటి తంత్రాల బారిన పడినా , జీవిత సమయంలో ఎంతోకాలం జైలులో ఉన్నా , నేరచర్య వలన కోర్టు తీర్పు కొరకు వేచి ఉన్నా , మరణ శిక్ష పడి చాలా కాలం పాటు కుటుంబానికి దూరం అయిపోయినా , శూన్యంలో ప్రయాణిస్తున్నా ఇలాంటి జాతకులు అందరూ కూడా ఈ ధూమావతిని కవచం సాధన చేయాలి ... శూన్యంలో ప్రయాణం , రీసెర్చ్ అండ్ సినిమా డైరెక్టర్లు ఈ రంగాలు అన్నింటికీ ధూమావతి ఆధిపత్యం వహిస్తుంది ..

ఆమె సాధారణంగా హిందూమతంలో పాత, ఆకర్షణీయం కాని వితంతువుగా చిత్రీకరించబడింది, కాకులు మరియు చాతుర్మాస్య కాలం వంటి అశుభకరమైన అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆమె ఆకర్షణీయం కాని ప్రదర్శన ఒక పాఠంగా ఉపయోగపడుతుంది, భక్తులను ఉపరితల అంశాలను దాటి చూసేలా మార్గనిర్దేశం చేస్తుంది మరియు బదులుగా, అంతర్గత సత్యాలను మరియు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

9. మహాదేవి

సర్వేంద్రియాలు అదుపు చేయగల శక్తినిచ్చే మహాదేవి.  నవరాత్రి ఉత్సవాల్లో మహాదేవిని పూజిస్తే సర్వేంద్రియాలను అదుపుచేసే శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.  హిందూ పురాణాలలోని వైరుధ్యాలను కలిగి ఉన్న మహాదేవిని చాముండేశ్వరిగా కొలుస్తారని స్కంద పురాణంలో చెప్పబడింది.   కొంతమంది యువత చెడుదోవ పడుతుంటే మహాదేవి దీక్ష చేపట్టి .. శాస్త్రం ప్రకారం పూజిస్తే  మంచి నడవిక వస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  

10. లక్ష్మీదేవి

తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక.నిజానికి తామర పువ్వు బురద నుంచి పుడుతుంది.ఆ విధంగా బురద నుండి పుట్టినప్పటికీ తామర పువ్వుకు ఎలాంటి బురద అంటకుండా స్వచ్ఛంగా బయటకు వస్తుంది.అదేవిధంగా మన జీవితంలో కూడా ఇతరుల గురించి పట్టించుకోకుండా సొంతంగా, స్వచ్ఛమైన మనసుతో ఎదగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది.

తామర పువ్వు కొలనులో లేదా సరస్సులో పుడుతుంది.సరస్సులో ఉన్నటువంటి ఈ తామర పువ్వుకు నిలకడ ఉండదు.నీటి ప్రవాహం వచ్చినప్పుడల్లా అటూ ఇటూ కదులుతూ ఊగుతూ ఉంటుంది.అలాంటి తామర పువ్వు పై కూర్చుని మనకు దర్శనమిస్తున్న లక్ష్మీదేవి కూడా తను ఒక చోట స్థిరంగా ఉండనని, తాను నిలకడ లేని దానినని చెప్పడం కోసమే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటారు. ఆది పరాశక్తి దేవి యొక్క అంతిమ రూపంగా పరిగణించబడుతుంది.