
తొంభైల్లో బాగా పాపులర్అయిన సీరియల్స్‌లో శక్తిమాన్ ఒకటి. పిల్లలు, పెద్దలూ అందరూ ఓ చోట చేరి ఈ సూపర్ హీరో విన్యాసాలకి చప్పట్లు కొట్టేవాళ్లు. 1997 లో ప్రారంభమైన ఈ సీరియల్ 2005 వరకు ఆడియెన్స్‌ని మెప్పించింది. అయితే తాజాగా ఈ శక్తిమాన్ మరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కానీ, ఈ సారి బుల్లితెరపై కాదు వెండితెరపై. శక్తిమాన్ కథను మూడు పార్ట్‌లుగా సినిమా తీస్తున్నారట. ఈ సీజన్స్‌లోనూ సూపర్‌హీరో ముఖేష్ ఖన్నానే శక్తిమాన్ అవతారమెత్తనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ముఖేష్ కన్నా రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి శక్తిమాన్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు.