శంషాబాద్‌లో కంటైనర్ బీభత్సం.. 2 గంటలు ట్రాఫిక్‌ జామ్

శంషాబాద్‌లో కంటైనర్ బీభత్సం.. 2 గంటలు ట్రాఫిక్‌ జామ్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కంటైనర్.. రాంగ్‌ రూట్‌లోకి దూసుకెళ్లి.. బీభత్సం సృష్టించింది. శంషాబాద్‌లో జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కంటైనర్.. మొదటగా కారును ఢీ కొట్టింది. ఆపై డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లి.. సర్వీస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఇసుక లారీని ఢీకొంది. 

ALSO READ : మళ్లీ మళ్లీ రద్దు అయిన గ్రూప్ 1

ఈ ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లుకు గాయాలయ్యాయి. వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాద కారణంగా శంషాబాద్, హైదరాబాద్ రహదారిపై రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయింది.