ఇండియన్ 2 మళ్ళీ వాయిదా? మండిపడుతున్న చరణ్ ఫ్యాన్స్

ఇండియన్ 2 మళ్ళీ వాయిదా? మండిపడుతున్న చరణ్ ఫ్యాన్స్

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్2(Indian2). లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా.. 1996లో వచ్చిన భారతీయుడు(Bharatheeyudu) మూవీకి సీక్వెల్ గా వస్తోంది. ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి ఇప్పటికే రేలీజైన పోస్టర్స్ ఆడియన్స్ లో అంచనాలను పెంచేసింది. 

అయితే ఈ సినిమా మొదటి నుండి ఆలస్యంగానే జరుగుతోంది. గతంలో షూటింగ్ సెట్స్ లో ప్రమాదం జరిగి దాదాపు.. కొన్ని నెలలపాటు షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. ఇండియన్2 మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందట.

ఈ సినిమా ఎట్టిపరిస్థితులల్లో 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా జాప్యం జరుగుతుందట. ఈ కారణంగా ఇండియన్2 మరోసారి వాయిదా పడటం ఖాయం అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ డైరెక్టర్ శంకర్ పై మండిపడుతున్నారు. ఎందుకంటే.. ఇండియన్2 రిలీజ్ తరువాత దాదాపు 5 నెలల తరువాత.. రామ్ చరణ్, శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్(Game changer) మూవీ రిలీజ్ కానుంది. కాబట్టి ఇండియన్2 రిలీజ్ లేటౌతే ఆటోమెటిక్ గేమ్ ఛేంజర్ మూవీ కూడా లేట్ అవుతుంది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ డైరెక్టర్ శంకర్ పై రెచ్చిపోతున్నారు.