
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 1996లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నాడు.యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్,సిద్ధార్థ్,రకుల్‌ప్రీత్ సింగ్,బాబీ సింహా,సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే తెలుగు,తమిళం,మలయాళం,హిందీ,కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ (AN INTRO),తో పాటు ‘‘శిరసెత్తే శిఖరం నువ్వే..అనే పాట సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.పెంచడమే కాదు..కమల్‌హాసన్ వాడే ఆయుధం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇదిలా ఉంటే..తాజా సమాచారం ప్రకారం..జూన్ 1న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాగా ఈవెంట్‌కు పలు భాషల నుంచి హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్న రాంచరణ్, కోలీవుడ్ నుంచి తలైవా రజినీకాంత్, మళయాళం నుంచి మెగాస్టార్ మోహన్ లాల్,బాలీవుడ్ లో రణవీర్ సింగ్ గెస్టులుగా రానున్నారట.అలాగే వీళ్లతోపాటు స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని..త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు తమిళ ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా పలు భాషల సినీ లవర్స్ కి , మేకర్స్ కి పండగనే చెప్పొచ్చు.
ఈ మూవీని జులై 12న తెలుగు,తమిళంతోపాటు హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.