ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో శంకర్(Shankar) అనే పేరు ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ పోస్టర్ మీద ఉంది అంటే చాలు ఎగబడి మరీ వెళ్లి ఆ సినిమా చూసే ఆడియన్స్ కోట్లల్లో ఉన్నారు. ఆయన ఎంచుకునే కథలు, వాటిని ప్రెజెంట్ చేసేవిధానం నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. జెంటిల్మెన్(Gentleman), ప్రేమికుడు(Premikudu), జీన్స్(Jeans), భారతీయుడు(Bharatheeyudu), ఒకే ఒక్కడు(Oke okkadu), అపరిచుతుడు(Aparichithudu), రోబో(Robo).. ఇలా ఏ సినిమా తీసుకున్న దేనికందే ప్రత్యేకం. కమర్షియల్ సినిమాల్లో సోషల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం. అలాంటి శంకర్ సినీ ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఏళ్ళు పూర్తయిన సందర్బంగా స్టార్ డైరెక్టర్ అంతా ఒక చోట చేరి సందడి చేశారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం(Manirathnam), గౌతమ్ వాసు దేవ్ మీనన్(Goutham vasudev menon), ఏఆర్ మురుగదాస్(AR Murugadas), కార్తీక్ సుబ్బరాజు(Karthik subbaraj), లింగుస్వామి(Linguswamy), లోకేశ్ కనగరాజ్(Lokesh kanagaraj) ఈ లిస్టులో ఉన్నారు. ఈ సందర్భంగా ఈ స్టార్ డైరెక్టర్లంతా కలిసి ఒకే ఫ్రెమ్ లో ఫొటో ఒకటి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
ఇక దర్శకుడు శంకర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తెలుగులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరో(Ram charan)గా గేమ్ ఛేంజర్(Game changer) అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటే లోకనాయకుడు కమల్ హాసన్(kamal haasan) తో ఇండియన్2(Indian2) సినిమాను కూడా తీస్తున్నారు శంకర్. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా.. 2024 చివరలో ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.