గంజాయి తీసుకున్న షణ్ముఖ్ .. కేసు నమోదు

గంజాయి తీసుకున్న షణ్ముఖ్ .. కేసు నమోదు

బిగ్‌బాస్‌ ఫేమ్ షణ్ముఖ్‌ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  షణ్ముఖ్‌ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయింది. షణ్ముక్‌ ఇంట్లో గంజాయి స్వాధీనం కావడంతో పోలీసులు అతనికి వైద్య పరీక్షలు చేయించారు. అందులో షణ్ముక్ గంజాయి తీసుకుంటున్నట్టుగా నిర్థారణ కావడంతో నార్సింగ్ పోలీసులు షణ్ముక్ పై కేసు నమోదు చేశారు.  మౌనిక అనే యువతి షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌పై ఫిర్యాదు చేయడంతో గంజాయి విషయం బయటపడింది.  షణ్ముఖ్‌ ఇంట్లో కూడా 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షణ్ముక్ అని అరెస్ట్ చేశారు. 

 షణ్ముఖ్ సోదరుడు సంపత్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని బాధితురాలు మౌనిక పోలీసులను ఆశ్రయించింది. ఎంగేజ్మెంట్ పేరుతో రింగ్ తోడిగాడని,  అంతేకాకుండా పలు మార్లు హోటల్స్, రిసార్ట్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని ఆరోపించింది.  ఇక షణ్ముఖ్ పలు వెబ్ సిరీస్ లలో అవకాశం ఇప్పిస్తానంటూ మోసం చేశాడంది.   సంపత్ కోసం వెళ్లిన నార్సింగ్ పోలీసులు రూంకు వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్లాట్ లో 16 గ్రాముల గంజాయితో షణ్ముఖ్ అతని సోదరుడు దొరికారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇరువురకి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది.