రేపు పార్టీ నేతలతో .. అజిత్, శరద్ పవార్ కీలక సమావేశం

రేపు పార్టీ నేతలతో .. అజిత్, శరద్ పవార్ కీలక సమావేశం

మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్.. రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు . సమావేశానికి రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి నేతలు, జిల్లా అధ్యక్షులు.. మండలపార్టీ కార్యదర్శులకు ఆహ్వానం పంపారు.ఈ సమావేశం బాంద్రాలో జరుగుతుందని చెప్పారు. అయితే అదే రోజు పార్టీనేతలతో సమావేశం నిర్వహిస్తానని శరద్ పవార్ ప్రకటించారు. 

YB చవాన్ ఆడిటోరియంలో జరిగే ఈ భేటీకి NCP ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్రస్థాయి నేతలు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. భావజాలానికి ద్రోహం చేసిన వ్యక్తులు తన ఫోటోను ఉపయోగించొద్దని అన్నారు శరద్ పవార్.  ఏ సమావేశానికి ఎంత మంది వెళ్తారనేదానిపై మహారాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. 

ముంబై మంత్రాలయం సమీపంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు అజిత్ పవార్. ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే నేతలంతా హాజరయ్యారు. NCP లో తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు అజిత్ పవార్. పార్టీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి షిండే మంత్రివర్గంలో కలిసి పనిచేస్తామన్నారు. దేశంలో మోదీ లాంటి నేత మరొకరు లేరన్నారు అజిత్ పవార్. 

మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో అజిత్ పవార్ వర్గం పాల్గొన్నది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలపై బుక్ లెట్ ను విడుదల చేశారు. అనుభవజ్ఞులైన వారు ప్రభుత్వంలోకి వచ్చారన్నారు మంత్రి సుధీర్ ముంగంటివార్. ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్నవాళ్లంతా తమకుతో టచ్ లో ఉన్నారని చెప్పారు. 
బైట్: సుధీర్ ముంగంటివార్. 

తాజా పరిణామాలతో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. దీనితో కీలక సమావేశం నిర్వహించారు. దీనిపై హైకమాండ్ కు నివేదిక పంపుతామన్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే. శరద్ పవార్, ఉద్దవ్ థాక్రేలతో కలిసి రాష్ట్ర పర్యటనకు ప్లాన్ చేస్తున్నామన్నారు దీనిపై ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడానన్నారు నానా పటోలే.  మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా తనను తొలగించే హక్కు అజిత్ పార్ కు లేదన్నారు జయంత్ పాటిల్. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ వెంటే ఉన్నారన్నారు.