జీడీపీలో తగ్గిన వ్యవసాయ రంగం వాటా : అర్జున్ ముంద్రా

జీడీపీలో తగ్గిన వ్యవసాయ రంగం వాటా : అర్జున్ ముంద్రా

 

న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా  2022–23 లో 15 శాతానికి తగ్గిందని లోక్‌‌‌‌‌‌‌‌సభలో అగ్రికల్చర్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జున్‌‌‌‌‌‌‌‌ ముంద్రా వెల్లడించారు.  1990 – 91 లో జీడీపీలో ఈ రంగం వాటా 35 శాతంగా రికార్డయ్యింది. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే  వ్యవసాయ రంగం వాటా తగ్గిందని అర్జున్ పేర్కొన్నారు. ‘ ప్రొడక్షన్ పడిపోవడం వలన  వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొడక్షన్ వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు.  వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని అర్జున్ పేర్కొన్నారు.  

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ జీడీపీలో  వ్యవసాయ  రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సస్టయినబుల్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌కు,  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయడానికి, వనరులను బాగా వాడుకునేందుకు ప్రభుత్వం వివిధ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు.  పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ను 2019 లో లాంచ్ చేశామని, రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నామని చెప్పారు.  ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతులకు రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు.