
ఇది వరకే మ్యూచువల్ ఫండ్ సేవలను అందిస్తున్న పేటీఎం, ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ ,ఇన్సూరెన్స్, లోన్ల విభాగాల్లోకి కూడా వస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ కొత్త సేవలను ప్రారంభిస్తామని తెలిపింది. పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్‌శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పేమెంట్స్ సొల్యూషన్స్‌లో ఇవి ప్రధానమైనవని అన్నారు. పేటీఎం పేమెంట్ ఆక్సెప్ట్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని, దీనివల్ల కస్టమర్లకు మరిన్ని ఆఫర్లు అందుతాయని చెప్పారు. ఇలాంటి ప్రొడక్ట్స్ విక్రయాలకు ఇండియా మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని శర్మ చెప్పారు. అయితే ఈ రంగంలో పోటీపెరగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందించే కంపెనీలకే అధిక ఆదరణ ఉంటుందని చెప్పారు. అధిక పోటీ వల్ల మరిన్ని ప్రాంతాలకు సేవలను విస్తరిం చవచ్చని అన్నారు. పేటీఎం తదుపరి విస్తరణకుమరిన్ని పెట్టుబడులు కావాలని, కస్టమర్ల అన్ని ఆర్థికఅవసరాలు తీర్చగల ప్లాట్‌ఫారంగా ఎదగాలన్నదితమ లక్ష్యమని శర్మ చెప్పారు. ఇది వరకే జపాన్‌లోసేవలు ప్రారంబించిన పేటీఎం, మరిన్ని దేశాలకు విస్తరిం చాలని నిర్ణయించుకుంది. విదేశాల్లో విస్తరిస్తున్న మాట నిజమే అయినా, మొదటి ప్రాధాన్యంమాత్రం ఇండియాకే ఉంటుందని అన్నారు.