
హైదరాబాద్, వెలుగు : షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) కాంపాక్ట్ కలర్ మల్టీఫంక్షనల్ ప్రింటర్ బీపీసీ 533డబ్ల్యూడీతోపాటు ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్ (పీఎన్ఎల్సీ752), పీఎన్ఎల్సీ862లను ప్రారంభించింది. ఇవి అన్ని రకాల ఆఫీసులకు అనువుగా ఉంటాయని ప్రకటించింది. ఇవి 33 పీపీఎం వేగంతో ప్రింటింగ్, కాపీ చేస్తాయి. ఫ్యాక్స్, వై-ఫై, ఎయిర్ప్రింట్, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, క్యూఆర్ కూడా ఉంటాయి.
డ్యూప్లెక్స్ సింగిల్ పాస్ ఫీడర్‌తో ఇది 130 ఓపీఎం వేగంతో రెండు-వైపుల డాక్యుమెంట్‌లను స్కాన్ చేయగలదు. సరైన స్కాన్ ఫలితాల కోసం రిజల్యూషన్, గ్రేడేషన్ కంప్రెషన్ రేట్లను సర్దుబాటు చేస్తుంది.