Sharwa 36: లూజర్ డైరెక్టర్తో శర్వానంద్..స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వా 36

Sharwa 36: లూజర్ డైరెక్టర్తో శర్వానంద్..స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వా 36

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) బర్త్ డే (మార్చి6) సందర్బంగా వరుస సినిమా అప్డేట్స్ ప్రకటిస్తున్నారు మేకర్స్. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మనమే మూవీలో నటిస్తూనే..మరో సినిమాను ప్రకటించేశాడు. 

లేటెస్ట్గా లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి (Abilashreddy)తో సినిమా చేస్తున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తవ్వగా..తాజాగా ఆసక్తికరమైన S36 పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మురికి రహదారిపై రేసులో బైక్ రైడర్‌లను..అధిగమించేందుకు ఎత్తుగా ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై S36 ట్యాగ్ చూపించారు. ఈ మూవీ స్పోర్ట్స్ బేస్డ్ గా ఉండబోతోంది..బైక్ రైడర్ గా శర్వా కనిపించబోతున్నారు. 

ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది. అంతేకాదు..అపుడే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తోన్నఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు, శర్వానంద్ మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్గా హీరో శ్రీవిష్ణు కు సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు(Ram Abbara)తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.