
- గుర్తుంచుకోదగిన అని కూడా అర్థం.. శశిథరూర్ వివరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేరళలోని వయనాడు పర్యటనపై విమర్శలు తలెత్తున్నాయి. శుక్రవారం వయనాడ్ వరద బాధితుల కోసం తన వంతు సహాయంగా కొంత సామగ్రిని అందజేశారు.
ఈ క్రమం లో వయనాడు టూర్ ‘మెమోరబుల్’ అని పేర్కొంటూ ఆయన పోస్ట్ చేశారు. వరదల్లో సర్వం కోల్పోయి ప్రజలు బాధ పడుతుంటే మెమోరబు ల్ అంటారా అని బీజేపీ నేతలతో పాటు పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో శశిథరూర్ వివరణ ఇచ్చారు.
‘‘గుర్తుండిపోయే, గుర్తుంచుకోదగ్గ సంఘటనలను ‘మెమోరబుల్’గా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.