అడవి నుండి తప్పిపోయి మేకల మందలో కలసి..

అడవి నుండి తప్పిపోయి మేకల మందలో కలసి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అడవి నుండి తప్పిపోయి వచ్చి మేకల మందలో కలిసిన కొండ గొర్రెను రెండు నెలలు పెంచి అటవీశాఖ  అధికారులకు అప్పగించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దమ్మపేట మండలం గొఱ్ఱెగుట్ట గ్రామానికి చెందిన సోయం పెద్ద ముత్యాలు అనే మేకల కాపరి రెండు నెలల క్రితం మేకలను మేపడానికి స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి మేకలను కొట్టంలోనికి పంపుతుండగా అనుకోకుండా ఆ గుంపుతో కలిసి వచ్చిన కొండా గొర్రెను చూసి ఆశ్చర్యపోయాడు. కొండ హోర్రెను ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఉంచి రెండు నెలలు పెంచి ఈరోజు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండ గొర్రెను స్వాధీనం చేసుకొని పాల్వంచ కిన్నెరసాని వన్య ప్రాణుల ఉద్యానవనానికి తరలించారు. వన్య ప్రాణులు అనుకోకుండా గ్రామాల్లోకి వస్తే ఎవరూ హాని తలపెట్టకుండా సమాచారం అందించాలని దమ్మపేట రేంజ్ ఆఫీసర్ వెంకటలక్ష్మి  కోరారు. కొండ గొర్రెలను  చంపకుండా స్వచ్ఛందంగా ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన మేకల కాపరి ముత్యాలును ఫారెస్ట్ రేంజర్ వెంకటలక్ష్మి అభినందించారు.