కెప్టెన్సీ పోతుందని ఎప్పుడు భయపడలేదు:శిఖర్ ధావన్

కెప్టెన్సీ పోతుందని ఎప్పుడు భయపడలేదు:శిఖర్ ధావన్

తనను కెప్టెన్సీ బాధ్యతలను తప్పిస్తారని ఎప్పుడూ భయపడలేదని టీమిండియా వన్డే తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. కెప్టెన్గా ఎక్కువ మ్యాచులు ఆడితేనే సరైన నిర్ణయాలు తీసుకోగలమన్నాడు.  గతంలో బౌలర్కు ఇబ్బందైనా సరే..అదనంగా ఓవర్  వేయించేవాడనని తెలిపాడు. కానీ ప్రస్తుతం టీమ్ అవసరాలకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోగల పరిణితి సాధించానని చెప్పుకొచ్చాడు.  శుక్రవారం నుంచి  న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో..వన్డే సిరీస్తో పాటు..పలు విషయాలపై ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

జట్టును బ్యాలెన్స్ చేసుకోవాలి...

సారథిగా  వృద్ధి చెందాలంటే టీమ్ను బ్యాలెన్స్ చేసుకోవాలని ధావన్ అన్నాడు. ప్లేయర్లకు  ఎక్కువ  అవకాశాలు ఇవ్వాలని అప్పుడే వారిలోని ప్రతిభ బయటపడుతుందని చెప్పాడు.  మ్యాచు సమయంలో  ఎవరైనా  ఒత్తిడికి లోనైతే..అతన్ని ఒత్తిడిని నుంచి బయటపడేసే బాధ్యత కెప్టెన్పై ఉంటుందన్నాడు. 

ఐపీఎల్ ట్రోఫీ గెలవడం ఈజీ..

పంజాబ్ కింగ్స్ జట్టు  కెప్టెన్సీ దక్కడంపై ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. సారథిగా  జట్టు మిస్టేక్స్ను సరిదిద్ది సరైన దారిలో పెడతానన్నాడు. గతంలో ఓడిపోయిన మ్యాచుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. ఆటగాళ్ల బాధ్యతను వాళ్లకు అర్థమయ్యేలా చేసి..జట్టును గాడిలో పెడతానన్నాడు. ఐపీఎల్ ఆడటం ప్రతీ క్రికెటర్కు కల అని చెప్పాడు. అయితే ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేసమయంలో ఒత్తిడిని జయించాలన్నాడు. ఒత్తిడిని జయిస్తే ఆటగాళ్లు రాణిస్తారన్నాడు.  జట్టుగా రాణిస్తే ఐపీఎల్ ట్రోఫిని గెలవడం పెద్ద కష్టమేమి కాదు.