యుద్ధ భూమిలో శింబు.. అంచనాలు పెంచుతున్న ఫస్ట్ లుక్

యుద్ధ భూమిలో శింబు.. అంచనాలు పెంచుతున్న ఫస్ట్ లుక్

శింబు(Shimbu) హీరోగా కమల్ హాసన్(Kamal Haasan) సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దేశింగ్ పెరియాసామి(Deshing Periyasami) దర్శకుడు. శింబు కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 48వ చిత్రం. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. శుక్రవారం శింబు బర్త్‌‌‌‌ డే సందర్భంగా విషెస్‌‌‌‌ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్‌‌‌‌ చేశారు. ఇందులో శింబు పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ కనిపించనంత న్యూ లుక్‌‌‌‌లో కనిపిస్తున్నాడు.

పైగా రెండు డిఫరెంట్‌‌‌‌ గెటప్స్‌‌‌‌లో ఎదురెదురుగా కనిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. చుట్టూ మంటలు ఎగిసిపడుతున్న రణరంగంలో ఇద్దరు పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ వారియర్స్‌‌‌‌ తలపడుతున్నట్టు దీన్ని డిజైన్ చేశారు. శింబు ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, అందులో ఓ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ నెగిటివ్‌‌‌‌ షేడ్స్‌‌‌‌తో ఉండబోతోందని అర్థమవుతోంది. టైటిల్‌‌‌‌తో పాటు ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.