శిరీష మర్డర్​ కేసు.. తండ్రే హత్య చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్థుల వాగ్వాదం

శిరీష మర్డర్​ కేసు.. తండ్రే హత్య చేశాడని ఆరోపిస్తూ.. గ్రామస్థుల వాగ్వాదం

వికారాబాద్​జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్​గ్రామంలో నర్సింగ్​ విద్యార్థిని శిరీష హత్య కేసులో ఊహించని ట్విస్ట్​లు ఎదురవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా శిరీష తండ్రి జంగయ్యే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు.  అల్లుడు అనిల్​ తో కలిసి హత్యకు ప్లాన్​ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శిరీషను అనిల్​ కొడుతుంటే తండ్రిగా నువ్వేం చేశావంటూ మహిళలు ప్రశ్నించారు. దీంతో శిరీష ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల జోక్యంతో గ్రామస్థులు చల్లబడ్డారు. 

జూన్​ 11న శిరీష మృత దేహం స్థానికంగా ఉన్న కుంటలో కనిపించడం ముందు రోజు బావ ఆమెను కొట్టడంతో పోలీసులు అనిల్​, తండ్రిపై కేసు నమోదు చేశారు. యువతి చేయి, కళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు. మరో వైపు శిరీష మృతదేహానికి వైద్యులు పరీక్షలు నిర్వహించడానికి పరిగి నుంచి డాక్టర్​ వైష్ణవి వచ్చారు. నీటికుంటలో పడినప్పుడు ఆమె కళ్లకు రాళ్లు గుచ్చుకుని గాయాలై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఆమెపై దాడి చేశారా, హత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆమె పోస్ట్​మార్టం రిపోర్ట్​కీలకంగా మారింది.