8వ రోజు వేడుకగా సహస్రాబ్ది ఉత్సవాలు

8వ రోజు వేడుకగా సహస్రాబ్ది ఉత్సవాలు

రంగారెడ్డి: ముచ్చింతల్ లో సమతామూర్తి సహస్రాబ్ది సమారోహ వేడుకలు కొనసాగుతున్నాయి. 8వ రోజు కార్యక్రమాల్లో భాగంగా లక్ష్మీ నారాయణ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఐశ్వర్య ప్రాప్తికై శ్రీ లక్ష్మీ నారాయణ ఇష్టి, సంతానప్రాప్తికై వైనతేయ ఇష్టి, చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ చేయనున్నారు. ప్రముఖ సాధుసంతులతో రెండో రోజు ధర్మాచార్య సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో 200మంది సాధు, సంతులు, పీఠాధిపతులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30గంటలకు ప్రవచన మండపంలో ప్రముఖులు ప్రసంగించనున్నారు. సాయంత్రం కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.

8వ రోజు సహస్రాబ్ది వేడుకలకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. వారు సమతామూర్తిని, దివ్య దేశాలను దర్శించుకుని కాసేపు శ్రీరామ నగరంలో గడపనున్నారు. సహస్రాబ్ది వేడుకలకు 385 మంది ధర్మాచార్యులు, వివిధ పీఠాధిపతులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.