
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్’. సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ని ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని డైరెక్ట్ చేస్తున్నాడు. శుక్రవారం సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చేతిలో గన్‌తో శివరాజ్ కుమార్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో ట్రైలర్‌ను విడుదల చేసి, అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నాడు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇదే రిలీజ్ డేట్‌కు తెలుగులో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు విడుదలవుతున్నాయి. మరోవైపు తమిళంలో విజయ్ ‘లియో’ రిలీజ్ కానుంది. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను టార్గెట్ చేసిన శివరాజ్ కుమార్ తెలుగు, తమిళ భాషల్లో గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు.