ఓజీ  తర్వాత రిటైర్​ అయిపోతానేమో : శ్రియా రెడ్డి

ఓజీ  తర్వాత రిటైర్​ అయిపోతానేమో : శ్రియా రెడ్డి

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్‌‌‌‌‌‌‌‌’ చిత్రం ఇటీవల విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో ‘రాధా రమ’ అనే కీలకపాత్రలో మెప్పించింది శ్రియా రెడ్డి. ఈ సినిమా గురించి, ఇందులో తనపాత్ర గురించి ఆమె మాట్లాడుతూ ‘‘పొగరు’ సినిమాలో నా నటన నచ్చి ప్రశాంత్ నీల్ నన్ను సంప్రదించారు. అప్పటికే నేను సినిమాలు చేయకూడదనుకున్నా. కానీ నీల్ పట్టు వదలకుండా, స్ర్కిప్ట్​ విన్నాక నిర్ణయం తీసుకోమంటూ, నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఇంపార్టెన్స్‌‌‌‌ గురించి చెప్పి ఒప్పించారు.

నిజానికి ఒరిజినల్ కథలో నా పాత్ర లేదు. ఆ తర్వాత స్క్రిప్ట్‌‌‌‌ వర్క్‌‌‌‌లో లేడీ విలన్ ఉంటే బాగుంటుందని క్రియేట్ చేశారు. అలాగని ఆ పాత్రని క్రూరమైన విలన్‌‌‌‌గా, బిగ్గరగా అరుస్తూ చూపించాలనే ఉద్దేశం లేదు. నెగిటివ్ టచ్ ఉంటూనే అందంగా ఉండేలా ‘రాధా రమ’ పాత్రను డిజైన్ చేశారు. ముఖ్యంగా లుక్ పరంగా చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. వెండితో నా ఆభరణాలు చేయించారు. షూటింగ్ టైమ్‌‌‌‌లో ఈ పాత్ర విషయంలో నేను, నీల్ ఎప్పుడూ గట్టిగా డిస్కస్ చేసుకుంటూనే ఉండేవాళ్లం. రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్ చేసి అభినందించారు.

 గేమ్ ఆఫ్ థ్రోన్స్, బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల  తరహాలో ఫస్ట్ పార్ట్‌‌‌‌ కంటే సెకెండ్ పార్ట్‌‌‌‌ మరింత అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్నా. అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. యాక్షన్‌‌‌‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నాది నెగిటివ్ రోల్ కాదు. ‘ఓజీ’ తర్వాత రిటైర్​ అయిపోతానేమో.. నా పాత్ర అంత గొప్పగా ఉంటుంది’ అని చెప్పారు.