
రాగిణి ద్వివేది ప్రధానపాత్రలో రచయిత జనార్ధన మహర్షి తెరకెక్కిస్తున్న సంస్కృత చిత్రం ‘శ్లోక’. ఆయన కూతుర్లు శ్రావణి, శర్వాణి నిర్మాతలు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. రుధ్రభూమి (స్మశానం)లోకి వెళ్లి ప్రకృతి ఆకృతితో మాట్లాడే ప్రత్యేకమైన యువతి పాత్రలో రాగిణి నటిస్తోంది.
తనికెళ్లభరణి, వజ్రేశ్వరి కుమార్, గురు దత్, జాక్‌మంజు, సూరప్పబాబు, ఆదిత్య, బద్రి దివ్యభూషణ్, సందీప్ మలాని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి దేశంలోనే పురాతనమైన స్మశానాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించామని, పలు భారతీయ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నట్టు జనార్థ మహర్షి చెప్పారు.