యావరేజ్ మైండ్సెట్తో ఆడితే యావరేజ్ ఫలితాలే వస్తాయి

యావరేజ్ మైండ్సెట్తో  ఆడితే యావరేజ్ ఫలితాలే వస్తాయి

టీ20 వరల్డ్ కప్లో పసికూన జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోవడంపై  ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ టీమ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నజట్టుపై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిందని మండిపడుతున్నారు. పాక్ టీమ్ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అక్తర్ బాబర్ ఆజమ్ టీమ్ పై పాక్ మాజీ బౌలర్ షోయబ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

యావరేజ్ మైండ్ సెట్..యావరేజ్ రిజల్ట్...
టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలవ్వడంపై మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాక్ జట్టు ఆటతీరుపై మండిపడ్డారు. యావరేజ్ మైండ్ సెట్ తో ఆడితే..యావరేజ్ ఫలితాలే వస్తాయని వ్యాఖ్యానించాడు. చిన్న జట్టు అని తేలిగ్గా తీసుకుని..ఆవరేజ్ ప్లేయర్లను ఎంపిక చేసుకున్నందుకు తగిన ఫలితం అనుభవించారని ఎద్దేవా చేశాడు. ఈ మేరకు తన యూ ట్యూబ్ ఛానళ్లో వీడియోను విడుదల చేశాడు. 

దారుణ ఓటమి...
టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్కు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. జింబాబ్వే విసిరిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో  పాక్ పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే  20 ఓవర్లలో 130 పరుగుకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 131 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్...20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులే చేయగలిగింది. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.