రెట్రో స్పై థ్రిల్లర్ జోనర్‎లో జాలిరెడ్డి కొత్త సినిమా.. వింటేజ్ గెటప్‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌ లుక్

రెట్రో స్పై థ్రిల్లర్ జోనర్‎లో జాలిరెడ్డి కొత్త సినిమా.. వింటేజ్ గెటప్‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌ లుక్

‘పుష్ప’ ఫ్రాంచైజీలో జాలి రెడ్డిగా గుర్తింపును అందుకున్న కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ లీడ్ రోల్‌‌‌‌లో ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు దర్శకత్వం వహిస్తుండగా వైశాక్  గౌడ నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్‌‌‌‌‌‌‌‌ శివ రాజ్‌‌‌‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  శుక్రవారం ధనుంజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. వింటేజ్ గెటప్‌‌‌‌లో  స్టైలిష్‌‌‌‌గా కనిపిస్తున్న ధనుంజయ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఎమోషన్స్‌‌‌‌తో కూడిన రెట్రో స్పై థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.