ఎలక్ట్రానిక్ చిప్ ల కొరత..ఎకానమీకి దెబ్బే!

ఎలక్ట్రానిక్ చిప్ ల కొరత..ఎకానమీకి దెబ్బే!

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల నుంచి వైఫై రూటర్లు, ఫ్రిడ్లు, కార్లు, టీవీల వరకు ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువులో కామన్ గా ఉండేది 'చిప్' ప్రస్తుతం చిప్ ల కొరత ఏర్పడుతుండటంతో  ఈ ఇండస్ట్రీలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. కరోనా ఇబ్బంది. సంక్షోభం, ఇతర కారణాల వలన గ్లోబల్ గా ఎలక్ట్రానికి  సప్లయ్ తగ్గింది. వీటి కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడే ఇండియా లాంటి దేశాలకు ఇది మరింత ఇబ్బంది పెట్టే అంశమే. దేశంలో చిప్ లతోపాటు ఇతర సెమీకండక్టర్ల దిగుమతులు విలువ ఏడాదికి 20-22 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇండస్ట్రీ డేటా చెబుతోంది. చిప్లు వంటివి రా మెటీరియల్స్ గా దిగుమతి చేసుకుంటుండగా, కొన్ని ప్రొడక్ట్లను ఫినిష్ గూడ్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం తైవాన్, సౌత్ కొరియా, యూఎస్ వంటి దేశాలు ఎలక్ట్రాని క్ చిప్ల సప్లయ్ ముందుందగా, చైనా కూడా డిజైనింగ్, మాన్యుఫాక్చరింగ్లో ఈ దేశ అందుకుంటోంది. మరోవైపు ఇండియాలో డిజైనింగ్ వరకు మెరుగుపడినా, మాన్యుఫాక్చరింగ్ విషయంలో చాలా వెనకబడి ఉన్నామనే చెప్పాలి. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్(ఎస్ఎస్ఐఎ) డేటా ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ 39,6 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఇది కిందటేడాది ఫిబ్రవరిలో నమోదైన సేల్స్ కంటే 14.7 శాతం ఎక్కువ. దీన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు సేల్స్ పెరిగాయని అంచనావేయొచ్చు. మరోవైపు చిప్ ల కొరత ఏర్పడుతుండడంతో డిమాండ్ ను చేరుకోలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి.

చాలా వేగంగా రికవరీ అయ్యాం...

గత కొంత కాలం నుంచే మార్కెట్లో  చిప్ ల సప్లయ్ తగ్గుతూ వస్తోందని ఎస్ఎఐ పేర్కొంది. కిందటేడాది కరోనా సంక్షోభం టైమ్లోనే దీనికి పునాది పడిందని చెబుతోంది. మార్కెట్ ని డిమాండ్ సప్లయను తప్పుగా లెక్కించడం వల్లే ఇప్పుడు ఎలక్ట్రానిక్ చిప్ల కొరత ఏర్పడుతోందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్(ఐఈఎస్ఏ) అభిప్రాయపడింది. కరోనా సంక్షోభం నుంచి ఇండస్ట్రీ రికవరీ అవ్వడానికి మూడు నాలుగు క్వార్టర్లు పడుతుందని అంచనా వేశామని, కానీ సెమీకండక్టర్లను వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు డిమాండ్ తక్కువ టైమ్లోనే పెరిగిందని ఐఈఎస్ఈ మాజీ చైర్మన్ సత్య గుప్తా అంచనావేశారు. లాక్ టైమ్ ఎలక్ట్రానిక్ వస్తువులకు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయ్యింది. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, వైఫై రూటర్ల డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ వలన పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ తగ్గి, సొంత కార్ల కొనుగోలు పెరిగాయి. కాగా, కార్లలో మైక్రో చిప్ వాడతారన్న విషయం తెలిసిందే. దీనికి  తోడు జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఫైర్ యాక్సి డెంట్, ఫ్రాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలో యూనియన్ స్ట్రయిక్ వలన ప్రొడక్షన్ ఆగిపో వడల వంటివి కూడా చిప్ల సప్లయ్ కొరతకు కారణమయ్యాయని మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఏఐటీ) సీఈఓ జార్జ్ .చిప్ల కొరత ఆటో అన్నారు. సెక్టార్ వంటి పెద్ద ఇండస్ట్రీలపై నెగిటివ్ ప్రభావం చూపుతోంది. ఇండియన్ ఎకానమీలో ఆటో సెక్లార్ చాలా కీలకం. ఆటో సెక్టార్లో సెమికండక్టర్ల కొరత నెలకొందని, రోజు రోజుకే దీని తీవ్రత పె రుగుతోందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. ఆటో కాంపోనెంట్ సప్లయర్లు సరియైన టైమ్కి ప్రాడక్ట్లను సప్లయ్ చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ చిప్లపై ఆధారపడే ఇతర సెక్టార్లు కూడా ఇబ్బంది పడు తున్నాయి. వీటికి ఆల్టర్నేటివ్ లేకపోవడంతో ఈ సెక్టార్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

హార్డ్ వేర్  సెక్టార్ కు ప్రభుత్వ దన్ను...

దేశంలోని ఎలక్ట్రానిక్ చిప్లను తయారు చేయడానికి ఇండియన్ కంపెనీలు ముందుకు రావడం లేదు. ఒక్క హై టెక్నాలజీ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 90 శాతం కెపాసిటీతో, 24/7 పనిచేస్తే ఇండస్ట్రీ లాభాల్లోకి వస్తుంది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా కూడా ఇండియా వెనకబడి ఉందని చెప్పాలి. ప్రస్తుతం 25 దేశాలు డైరెక్ట్ గా సెమీకండక్టర్లను సప్లయ్ చేస్తున్నాయి. ఈ సప్లయ్ చెయిను సపోర్ట్ మరో 23 దేశాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఇండియా లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ ఆప్ ఎలక్ట్రానిక్స్ (ఎసీఈసీఎస్) వంటి స్కీమ్ వలన దేశీయహార్డ్వేర్ సెక్టార్లెవలప్ అవుతుందనే అంచనాలున్నాయి.