విస్తారా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ల కొరత

విస్తారా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ల కొరత

ఢిల్లీ : విమానయాన సంస్థ విస్తారా పైలట్ల కొరతను ఎదుర్కొంటోంది. తగినంత సిబ్బంది లేకపోవడంతో నిన్న 50 విమానాలు రద్దు చేసిన విస్తారా..  ఇవాళ మరో 38 విమానాలను క్యాన్సల్‌ చేసింది. ఉదయం వివిధ  నగరాల నుంచి బయల్దేరాల్సిన ప్లైట్స్ ను రద్దుచేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో ముంబై నుంచి టేక్ఆఫ్‌ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి.

నిన్న విస్తారాకు చెందిన 160 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీంతో విమానాయనా సంస్థపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విస్తారా విమానాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. సరైన సమాచారం ఇవ్వట్లేదని కూడా చెబుతున్నారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యంపై విస్తారా క్షమాపణలు చెప్పింది. కొన్ని రోజులుగా తాము పైలట్ల కొరతతోపాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. వీలైనంత తొందరగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని పేర్కొంది.