ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు కలకలం సృష్టించాయి.  మెహ్ రౌలీ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత  నరేష్ యాదవ్  గుడికి వెళ్లి వస్తుండగా ఆయన కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆప్ కార్యకర్త ఒకరు మరణించగా మరొకరికి గాయాలయ్యాయి.

మంగళవారం రాత్రి 10.30 గంటలకు నరేష్ యాదవ్  గుడికి వెళ్లి వస్తుండగా తన మద్దతుదారులతో కారుపై నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అక్కడ టపాసులు పేలుస్తున్నారు.  అదే సమయంలో కారుపై కాల్పులు జరిపారు. మొదట్లో టపాసుల సౌండ్ అనుకున్నారు కానీ తర్వాత తన కారుపై కాల్పులు జరిగాయని తెలవగానే ఎమ్మెల్యేను మరో కారుకు తరలించారు.

తన కాన్వాయ్ పై  కాల్పులు జరిపిన దుండగులను గుర్తించడానికి పోలీసులు సిసిటివి ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించాలని నరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సంఘటన నిజంగా దురదృష్టకరమన్నారు. దాడి వెనుక కారణం తనకు తెలియదు కాని అది అకస్మాత్తుగా జరిగిందన్నారు. సుమారు 4 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు.

see more news

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్

టీ20లకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్