అమెరికాలోనే చదవాలి.. ఇండియన్​ స్టూడెంట్ల చాయిస్ ఇదే!

అమెరికాలోనే చదవాలి.. ఇండియన్​ స్టూడెంట్ల చాయిస్ ఇదే!

హైదరాబాద్​, వెలుగు: విదేశాలలో ఉన్నత విద్యను కోరుకునే భారతీయ విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ మొదటి చాయిస్ ​అని స్టడీ ద్వారా వెల్లడయిందని మనదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. 2022–-23 విద్యా సంవత్సరంలో 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. గత ఏడాదితో  పోలిస్తే వీరి సంఖ్య 35శాతం పెరిగిందని  సంబంధించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్​ (ఓడీఆర్​) తెలిపింది.   ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్  నిర్వహించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదలను పరిశీలించడమే కాకుండా వారి నేపథ్యాలు, ఆర్థిక సహాయ వనరులపై స్టడీ చేస్తుంది. అమెరికాలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు.  ఈ ఏడాది జూన్–-ఆగస్టు సీజన్‌‌‌‌‌‌‌‌లో రికార్డుస్థాయిలో స్టూడెంట్ వీసాలను ఇచ్చామని ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి చెప్పారు. 

ALSO READ : గాజా స్వాధీనం : హమాస్ పార్లమెంట్ లో ఇజ్రాయెల్ సైన్యం