మనం బతకడం కోసం షార్క్స్ సచ్చిపోవాల్నా?

మనం బతకడం కోసం షార్క్స్ సచ్చిపోవాల్నా?

కోవిడ్ ప్రపంచాన్నే ఒక ఇన్సెక్యూరిటీ లోకి నెట్టింది. కరోనా ప్రభావం అన్ని రంగాల మీదా పడింది. కొన్ని దేశాల జీడీపీ అయితే కొన్ని సంవత్సరాలు వెనక్కి పోయింది.  సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో దాదాపు అన్ని దేశాలూ ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ తయారీ… పాపం సముద్రం లో ఉండే షార్క్స్ కి మాత్రం పెద్ద ప్రమాదమే తెచ్చింది….

ఎందుకంటే ఈ… షార్క్స్ లివర్ నుంచి వచ్చే ఆయిల్ కరోనా వ్యాక్సిన్ తయారీకి అవసరం. షార్క్ లివర్ ఆయిల్ లో స్క్వాలెన్ నే వ్యాక్సిన్ లో వాడుతున్నారు. షార్క్ స్క్వాలెన్ మనిషి రోగనిరోధకశక్తిని పెంచుతున్నదని సమాచారం. డబ్ల్యూహెచ్ఓ రెగ్యులేటరీ అఫైర్స్ ప్రొఫెషనల్స్ సొసైటీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మెజారిటీ వ్యాక్సినల్లో ఈ స్క్వాలెన్ వాడుతున్నారు. అంతపెద్ద మొత్తంలో లివర్ ఆయిల్ కావాలంటే కొన్ని లక్షల షార్క్స్ ని చంపాల్సిందే. వరల్డ్ లో సరిపోయేంత వ్యాక్సిన్ ఒక దశ తయారీకి కనీసం అయిదు లక్షల షార్క్స్ ని చంపాల్సిందేనట. అయితే ఈ స్క్వాలెన్ మొక్కలనుంచి కూడా తీసుకోవచ్చు కానీ షార్క్ లివర్ లో దొరికినంత ఎక్కువ దొరకదు. దాన్ని కలెక్ట్ చేయటానికి కూడా చాలా టైం పడుతుందట. ఇప్పటికే బ్యూటీ ప్రోడక్ట్స్లో ఈ షార్క్ స్క్వాలెన్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఇక తినటానికి కూడా షార్క్స్ ని వేటాడుతున్నారు. ఇదే లెక్కలో షార్క్స్ ని చంపుకుంటూ పోతే మొత్తం షార్క్స్ అంతరించి పోవటానికి మరీ ఎక్కువ కాలం పట్టదంటున్నారు ఎకాలజిస్టులు.

 స్క్వాలిన్ ఎక్కువగా ఉండే గుల్పర్ షార్క్, బాస్కింగ్ షార్క్ ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయి. అయినా సరే వాటి వేట కొనసాగుతోంది. ఈ కరోనా ప్రభావం ఇంకెన్ని రోజులు ఉంటుందో. ఎన్ని వ్యాక్సిన్లు తయారు చేస్తారో ఇప్పుటికిప్పుడే చెప్పటం కష్టం. ఈ స్క్వాలెన్ ని తయారు చేయటం కూడా కుదరదు కాబట్టి షార్క్స్ ని చంపటం తప్ప ఇప్పటికి ఇంకో మార్గం లేదు. పాపం షార్క్స్…