ఆస్పత్రి ICUలో శ్రేయాస్ అయ్యర్ : కడుపులో బ్లీడింగ్ అవుతుందంట..!

ఆస్పత్రి ICUలో శ్రేయాస్ అయ్యర్ : కడుపులో బ్లీడింగ్ అవుతుందంట..!

టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టేటపుడు  తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పక్కటెముక గాయం కారణంగా వెంటనే గ్రౌండ్ వీడిన శ్రేయాస్ డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే  సిడ్నీలోని ఆస్పత్రిలో చేర్చారు.  

 వైద్య పరీక్షల్లో శ్రేయాస్ కు  అంతర్గతంగా రక్తస్రావం అయినట్లు గుర్తించిన డాక్టర్లు అతడికి  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)చికిత్స అందిస్తున్నారు. శ్రేయాస్ రెండు రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. రాబోయే 48 గంటల్లో రక్తస్రావం తగ్గకపోతే.. అతడికి వారం రోజుల వరకు రెస్ట్ అవసరమం ఉంటుందని డాక్టర్లు సూచించారు. అతడి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెస్ట్ సమయాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ తో అబ్బురపరిచారు. శనివారం (అక్టోబర్ 25)న జరిగిన  వన్డేలో అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ కు ఫిదా కావాల్సిందే. హర్షిత్ రానా వేసిన ఇన్నింగ్స్ 34 ఓవర్ నాలుగో బంతిని ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బాల్ గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ వెనక్కి వేగంగా పరిగెత్తాడు. అసాధ్యమనుకున్న క్యాచ్ ను డైవ్ చేస్తూ అందుకున్నాడు.  స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆశ్చర్యానికి గురి చేసిన అయ్యర్ గాయపడ్డాడు. డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకు బలంగా తాకింది. దీంతో గ్రౌండ్ లోనే  నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళాడు.

 ఆసిస్ తో  తొలి వన్డేలో ఫేలవమైన ఫామ్ కనిపించిన శ్రేయాస్ రెండో వన్డేలో  హఫ్ సెంచరీతో రాణించాడు. గత ఏడాది కారణంగా శ్రేయాస్ అయ్యార్ కెరీర్ గాయాలతో ఇబ్బంది పడుతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వెన్నునొప్పి కారణంగానే మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది.  తర్వాత రెస్ట్ తీసుకోవడం..రంజీ మ్యాచ్ లకు దూరంగా ఉండటంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. స్వల్ప విరామం తీసుకుని మళ్లీ ఇంగ్లాండ్ సిరీస్, చాంపియన్స్  ట్రోఫీకి కోసం వన్డేలకు  సెలక్ట్ అయ్యాడు.