Shreyas Iyer: మరో నెలపాటు రెస్ట్.. సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం

Shreyas Iyer: మరో నెలపాటు రెస్ట్.. సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ దూరం

టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సౌతాఫ్రికా సిరీస్ కు దూరం కానున్నాడు. నవంబర్ చివర్లో సఫారీలతో ఇండియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్న శ్రేయాస్ ఈ నెలాఖరులోగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. రిపోర్ట్స్ అయ్యర్ కు మరో నెల రోజుల పాటు రెస్ట్ కావాలని సూచిస్తున్నాయి. టెస్టులకు కొన్ని నెలల పాటు దూరంగా ఉంటానని చెప్పిన ఈ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్.. టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దీంతో వన్డే క్రికెట్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. 

ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతూ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ ఆదుకునే క్రమంలో అయ్యర్ డైవ్ చేయడంతో అతని పక్కటెముకలకు గాయమైంది. శ్రేయాస్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతను తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఫిట్‌గా ఉండటానికి ఇంకా సమయం కావాలి. ఈ లోపు అయ్యర్ విషయంలో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ తొందరపడకూడదని భావిస్తున్నాయి. జనవరి 2026లో న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ సమయానికి అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశముంది. సౌతాఫ్రికా సిరీస్ కు అయ్యర్ దూరమైతే అతని స్థానంలో వైస్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో ఆసక్తికరంగా మారింది. 

ALSO READ : ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను మరో లెవెల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాలె

క్యారీ క్యాచ్ పడుతూ గాయం:
 
సిడ్నీ వేదికగా శనివారం (అక్టోబర్ 25) ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ 34 ఓవర్ నాలుగో బంతి ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బాల్ గాల్లోకి లేచింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‎లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ వెనక్కి వేగంగా పరిగెత్తాడు. అసాధ్యమనుకున్న క్యాచ్‎ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఆశ్చర్యానికి గురి చేసిన అయ్యర్ గాయపడ్డాడు. డైవ్ చేసినప్పుడు అతని భుజం నేలకు బలంగా తాకింది. దీంతో గ్రౌండ్‎లోనే  నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో గ్రౌండ్ వదిలి వెళ్ళాడు. 

ఈ క్యాచ్ అందుకున్న తర్వాత శ్రేయాస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మైదానం నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు గాయంపై పెద్దగా ఆందోళన లేకపోయినా.. ఆ తర్వాత రోజు వైద్య పరీక్షల్లో శ్రేయాస్ కు  అంతర్గతంగా రక్తస్రావం అయినట్లు డాక్టర్లు గుర్తించారు. అతడికి  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)చికిత్స అందిస్తున్నారు. మూడో వన్డే ముగిసిన తర్వాత స్కానింగ్‎లో అయ్యర్ ప్లీహానికి గాయమైనట్లు తేలింది. రాబోయే 48 గంటల్లో రక్తస్రావం తగ్గకపోతే.. అతడికి వారం రోజుల వరకు రెస్ట్ అవసరమం ఉంటుందని డాక్టర్లు సూచించారు.