
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మిస్సయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. లోయర్ బ్యాక్ ఇంజ్యురీతో బాధపడుతున్న అతను సర్జరీ చేయించుకోనున్నాడు. ఒకవేళ సర్జరీ జరిగితే అతను ఐదు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుంటే అక్టోబర్–నవంబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన ప్లేయర్లకు ఐపీఎల్‌కు ముందు నాలుగు రోజుల బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత వీళ్లు తమ ఫ్రాంచైజీలతో కలవనున్నారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.