టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ఆర్సీబీని లీడ్ చేస్తున్న కొత్త కెప్టెన్

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్.. ఆర్సీబీని లీడ్ చేస్తున్న కొత్త కెప్టెన్

ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు ధర్మశాల వేదికగా జరగనున్న ఆసక్తికర పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS) టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో ప్రత్యేక సన్నాహాలు మొదలు పెట్టాయి. ఇక ఆర్సీబీ అయితే ఏకంగా కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతుండగా.. ఈ మ్యాచులో తప్పకుండా గెలిచి ప్లేఆఫ్స్ కి చేరుకోవాలని పంజాబ్ చూస్తుంది.  

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. నేను పాత రికార్డులు, గణాంకాలను పెద్దగా పట్టించుకోను, గ్రౌండ్‌లో ఆట ఎలా సాగుతుందనేదే ముఖ్యం.. మనం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సత్తా చాటితే టాస్ గెలిచామా లేదా అనేది మ్యాటర్ కాదు.. నిజానికి కెప్టెన్‌గా ఇది నా 100వ మ్యాచ్ అని నాకు తెలియదు.. కానీ ఈ రోజు మ్యాచ్ గెలిస్తే అదే నాకు అత్యంత సంతోషాన్నిస్తుంది.. మా బౌలింగ్ దళం అద్భుతంగా రాణిస్తోంది, అయితే ఒత్తిడిని ఎంజాయ్ చేస్తూ ఆడటంపైనే మా ఫోకస్ అంతా ఉందని శ్రేయస్ పేర్కొన్నాడు. 

ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ మాట్లాడుతూ.. మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం.. అయితే వికెట్ చాలా అద్భుతంగా ఉంది, 40 ఓవర్ల పాటు పిచ్ ఆటగాళ్లకు పూర్తిగా సహకరిస్తుందని భావిస్తున్నా.. రజత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు, త్వరలోనే అతన్ని హైదరాబాద్‌లో చూస్తామని ఆశిస్తున్నాం.. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది.. ఈ రోజు మేము సాధించే విజయం మాకే కాకుండా, పాయింట్ల పట్టికలో మిగతా జట్ల సమీకరణాలను కూడా మార్చేస్తుందని తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చేశాం.. రజత్ స్థానంలో సుయాష్, డఫ్ఫీ స్థానంలో రొమారియో తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చారని జితేస్ వెల్లడించాడు. 

ఇరు జట్లు: 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్ కీపర్/కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ

పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్