Yash-Toxic: యశ్‌ టాక్సిక్‌ లో..ఇద్దరు స్టార్ హీరోయిన్స్!

Yash-Toxic: యశ్‌ టాక్సిక్‌ లో..ఇద్దరు స్టార్ హీరోయిన్స్!

స్టార్ హీరో యశ్‌(Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు.భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే..ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ యశ్‌కి జోడిగా నటిస్తున్నారట.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అడ్వాణీ (Kiara Advani) అండ్ సలార్ మూవీ హిట్ తో మంచి ఊపులో ఉన్న శ్రుతిహాసన్‌(Shruti Haasan) పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే రీసెంట్ గా సాయిపల్లవి, కరీనా కపూర్‌ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు కొత్తగా కియారా, శృతి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే శృతి హాసన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో టాక్సిక్ సినిమాలో కనిపించే భామల పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  

రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.  ఏప్రిల్ 10, 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తరువాత యశ్‌ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియెస్ట్ చేస్తుందో చూడాలి.