
శ్రుతి హాసన్(Shruthi Haasan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో సలార్(Salaar) ఒకటి. తొలిసారిగా ఈ సినిమాతో శ్రుతి ప్రభాస్(Prabhas)తో కలిసి నటించనుంది. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఈ టైంలో శ్రుతి హాసన్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.ఇటీవల శాకుంతలం సినిమాతో సమంత మొదటి సారి వెండితెరపై తన గొంతు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సలార్ కోసం శ్రుతి కూడా పెద్ద సాహసమే చేస్తోంది. ఐదు భాషల్లో సొంతగా డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే మూడు భాషలు కంప్లీట్ చేసి మరో రెండు భాషల్లో డబ్బింగ్‌కు రెడీ అవుతోందట. యాక్టర్ కన్నా ముందు ఈ హీరోయిన్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక సలార్ సినిమా విషయానికి వస్తే..సలార్ సినిమా రెండు పార్ట్స్ గా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనుంది. మొదటి పార్టీ కు సలార్: సీజ్ ఫైర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో పృద్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటిస్తున్నారు. కెజిఎఫ్ కు అదిరిపోయే మ్యూజిక్ ను అందించిన రవి బాసృర్ సలార్ కు సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.