IND vs AUS : కెప్టెన్ ఔట్.. శుభ్మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్

IND vs AUS : కెప్టెన్ ఔట్.. శుభ్మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్

అహ్మదాబాద్ లో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో మూడో రోజు ఆట మొదలయింది. ఓవర్ నైట్ స్కోరు 36 / 0 తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. తొలి వికెట్ కు కెప్టెన్ రోహిత్ శర్మ (35,58 బంతుల్లో), శుభ్ మన్ గిల్ 74 పరుగులు జోడించారు. నిలకడగా ఆడుతున్న భారత్ కు సెషన్ మొదట్లోనే షాక్ తగిలింది. ఆచితూచి ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను కునెమన్ ఓట్ చేశాడు. లబుషేన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుతాడు.

తర్వాత వచ్చిన పుజారా (22)తో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (66) ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చక్కని షాట్స్ ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. అయితే, ఈ భాగస్వామ్యం నిలబడటం భారత్ కి చాలా అవసరం. తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ కూడా సూధీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం టీమిండియాకు చాలా అవసరం.